
telugu galam news e69news local news daily news today news
గళం న్యూస్ కామేపల్లి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కెప్టెన్ బంజర గ్రామంలో అహ్మదియ్య ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల పదవిదారుల ఒక్క రోజు శిక్షణా శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఇందులో రెండు జిల్లాలకు సంబందించిన పలు గ్రామాల జమాత్ పదవిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రతినిధి హైదరబాద్ జిల్లా అధ్యక్షులు హామీదుల్లాహ్ హాసన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.మరియు జిల్లా అధ్యక్షులు షేక్ హుస్సేన్ సాహెబ్ మరియు జిల్లా ఇంఛార్జి ముహమ్మద్ అక్బర్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జమాత్ పదవిదారులు వినయం విధేయత,మృధు స్వభావం చిరు నవ్వు వంటి ఉత్తమ లక్షణాలను తమలో అలవర్చుకోవాలని దురలవాట్లకు దూరంగా ఉండవలెనని అదేవిధంగా నేటి సమాజానికి మనం ఉత్తమ ఆదర్శంగా నిలబడాలని హితవు పలికారు.అలాగే తమకు అప్పగించిన బాధ్యతలను సరియైన విధంగా నిర్వర్తించి ఇస్లాం అభివృద్ధికి మరియు సమాజ శ్రేయస్సుకు బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ బంజార గ్రామ జమాత్ అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా సాబ్, కాసర్ల పహాడ్ గ్రామ అధ్యక్షులు దస్తఘీర్ సాబ్,బండ్లపల్లి గ్రామ అధ్యక్షులు రహీముద్దిన్ సాబ్ వెంకటగిరి ఉపాధ్యక్షులు బాబుమియ, జిల్లా సెక్రెటరీ షేక్ కాసీమ్ మరియు శాఖల కార్యదర్శులు షేక్ రహీముద్దిన్,మదార్ హుస్సేన్,రజ్జాక్ పాషా,బద్రుద్దిన్,పుల్లా సాహెబ్,జాన్ పాషా,షేక్ అలి,షేఖ్ మౌలానా,షేక్ కరీం సాబ్,షేక్ జాను,అశ్రఫ్,మోల్విలు ముహమ్మద్ హుస్సేన్,షేక్ ముస్తఫా,బాబర్ అహ్మద్, ఆరిఫ్ పాషా,ముహమ్మద్ ముస్తఫా,ముహమ్మద్ రంజాన్,మహబూబ్ పాషా తదితరులు యువకులు పిల్లలు పాల్గొన్నారు.