
*బహుజన్ సమాజ్ పార్టీ(BSP)అసెంబ్లీ ఇంఛార్జి గడ్డం బిక్షపతి గౌడ్* ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రధాన జాతీయ రహాదారి 163 గత 20 సంవత్సరాలుగా క్రితం నక్సల్స్ ప్రభావితం ఎక్కువగా ఉండటం వలన పోలీసు ఉన్నత అధికారులు ఈ ప్రధాన జాతీయ రహదారినీ మూసివేయడం జరిగినది అప్పటి నుండీ ప్రస్తుత నేటి రోజు వరకు అది అలాగే ఉంది జాతీయ రహదారి మూసివేసే సరికి ఐటీడీఏ పీవో గెస్ట్ హౌస్ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి భారీ వాహనాలు కంటైనర్ వెళ్ళాలంటే ఒక్కో సారి ఇరుక్కుపోయి గంటల తరబడి సమయం పడుతుంది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు, ఆటోలు స్కూల్ వ్యాన్ లు స్కూల్ పిల్లలు గంటల తరబడి స్కూల్ విద్యార్ధులు వేచి ఉండి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పై ఎన్ని సార్లు పై ఉన్నతాధికారులకు చెప్పి మొరపెట్టుకున్నా స్పందించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క మరియు ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే జాతీయ రహదారి 163 పోలీస్ స్టేషన్ ముందు ఉన్న బారికెడ్లు చెక్ పోస్ట్ ద్వారములు తీసివేసి ఐటీడీఏ పీవో గెస్ట్ హౌస్ చుట్టూ కాకుండా డైరెక్ట్ గా వాహనాలు పంపించాలని బహుజన్ సమాజ్ పార్టీ(BSP)ములుగు అసెంబ్లీ ఇంఛార్జి గడ్డం బిక్షపతి గౌడ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) జిల్లా మహిళా కన్వీనర్ గుంటపూడి తిరుమలక్క,అసెంబ్లీ అద్యక్షులు ఏంపల్లీ వీరాస్వామి, ఏటూరునాగారం మండల అద్యక్షులు ఏంపల్లి రాజు,మంగపేట మండల అద్యక్షులు మురళి గౌడ్ పాల్గొన్నారు.