గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం
పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి. పరకాల పట్టణ కేంద్రంలోని 1,2,12,13,14 వార్డులలో అధికారులు మరియు స్థానికులతో కలిసి సైడ్ డ్రైనేజ్, పారిశుద్ధ్య,రోడ్డు నిర్మాణ పనులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పరకాల పట్టణం ముంపుకు గురి కాకుండా ప్రణాళికాబద్ధంగా అంచలవారిగా నగరాన్ని తలపించేలా సుందరీ కరణ చేసి అభివృద్ధి చేస్తానని అందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు.టి యు ఎఫ్ ఐ డి సి నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు.గతంలో వచ్చిన నిధులు సక్రమంగా ఉపయోగించుకోకపోవడం వల్ల నిరుపయోగం అయ్యాయని తెలిపారు.గత ప్రభుత్వ పాలకులు వర్షపు నీరు పారుదల డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయకుండా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.తను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన డిపిఆర్ వ్యవస్థతో డ్రైనేజీ రోడ్లు తాగునీటి వ్యవస్థను వచ్చే 40 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నామన్నారు.పరకాల పట్టణాన్ని ఆరు జోన్లుగా విభజించి జనన ఆధారంగా వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నామన్నారు.3,4,6 జోన్లో మొదటి ఫేజ్ లో,1,2,5 జోన్లు 2 ఫేస్ లో అభివృద్ధి చేస్తామన్నారు. పరకాలను విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, ఇందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, టాస్క్,ఇండోర్ స్టేడియం అభివృద్ధి, స్విమ్మింగ్ పూల్, ఏర్పాటు చేస్తున్నామన్నారు.