హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు తెలంగాణా రాష్ట్రంలోని అన్ని జిల్లాల మండల/బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులతో తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు థాకరే సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను ప్రజాక్షేత్రంలో ఎలా స్పందించాలో మండల/బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.అనంతరం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మండల/బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రతి బూత్ లో ప్రతి ఇంటింటికి హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై చార్జి షీట్ చేసి కరపత్రాలను రూపొందించి ప్రతి గడప గడపకు చేర వేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసామో ఇప్పుడు బిజేపి మరియు బిఆర్ఎస్ ప్రభుత్వాలు ఏం అభివృద్ధి చేసారో ప్రజలకు వివరించాలని, బిఆర్ఎస్ చేస్తున్న దాడులకు భయపడవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని రాబోయేది మన ప్రభుత్వమేనని అన్నారు. ఈ సమావేశంలో ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి, నవీద్ జావిద్, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, వి.హెచ్ హనుమంత రావు, పోరిక బాలరాం నాయక్, జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.