
గృహలక్ష్మి దరఖాస్తు గడువు పెంచాలి- మంద సంపత్
హన్మకొండ, పేదలు గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకోవడానికి ఈ నెల 10లోపే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విధించిన మరో నెల రోజులకు పొడిగించాలని సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు, సౌత్ ఏరియా కమిటీ కార్యదర్శి మంద సంపత్ అన్నారు. బుధవారం రాంనాగర్ పార్టీ కార్యక్రమంలో ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత ఇంటి జాగా ఉండి ఇల్లు నిర్మించుకునే గ్రామీణ ప్రాంతాల్లో మీసేవా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, సాంకేతిక కారణాలతో పనిచేయకపోవడంతో ఈ గడువు సరిపోదని ఆయన తెలిపారు. కొంతమంది అర్హులు ఈ పథకానికి దూరమయ్యే ప్రమాదం ఉందని అయన ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి దరఖాస్తు గడువును ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొదటి విడత గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి మూడువేల ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గైడ్‌లైన్స్‌లో పేర్కొన్న కొన్ని అంశాల వల్ల కొంతమంది అర్హులు దూరమవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు నోముల కిషోర్, కంచర్ల కుమరస్వామి, మాచర్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.