
*నగదు బదిలీ చేయకుంటే ప్రభుత్వం పతనం ఖాయం*
*గొర్రెల మేకల పెంపకందారుల సంఘం GMPS రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ డిమాండ్*
చిల్పూర్ మండలం ఈరోజున గొర్రెల మేకల పెంపకందారుల సంఘం(GMPS)జిల్లా కమీటి విస్తృత స్థాయి మల్లన్నగండి గార్లగడ్డ తండా సమ్మక్క సారాలమ్మ గద్దెల ఆవరణలో సమావేశంలో జిల్లా అధ్యక్షులు మోటే దేవేందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (GMPS)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొల్లకూరుమలకు గొర్రెల పంపిణీ 2017 జూన్ 20 న మన తెలంగాణ పశుసంవర్థకశాఖ & మత్స్య కార్మిక శాఖ & సినీ పరిశ్రమ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల పంపిణీ కార్యక్రమం మాట్లాడుతూ తెలంగాణలో మాంసం ఉత్పత్తిలో చాల వెనుకబడి పోయమని మన రాష్టానికి ఇతర రాష్టాలనుండి అనేకమైన గొర్రెలు మేకలు దిగుమతి అవుతున్నాయి కావున అక్కడి రాష్ట్రములోని గొర్రెల కాపరులు ఆర్థికకంగా మన డబ్బులతో వారు అభివృద్ధి చెందుతున్నారని. రాష్ట్రములోని గొల్లకూరుమల కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వారిని మొదలు కొని ముసలి వారి వరకు ఒక్క కుటుంబంలో ఎంతమంది మగవాళ్ళు ఉంటే అంతమందికి గొర్రెల పంపిణీ చేపట్టి తెలంగాణలోని గొల్లకూరుమలను కోటీశ్వర్లు చేస్తానని. గొర్రెలు మేత మేయుటకు గ్రామాలలోని మమీడి తోటలు. పండ్ల తోటలలో మేతగడ్డికి ప్రభుత్వం గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తామని. ముందు మన రాష్ట్రములో ఉన్న గొర్రెలకు ఉచితంగా గొర్రెలకు(ఇన్సూరెన్స్)బీమాపథకం చేస్తామని. ఉపాధి హామీ ధ్వారా గొర్రెలకు షెడ్స్ నిర్మాణం చేసీస్తామని. అక్కడి నుండి వచ్చే గొర్రెలకు అక్కడే ఇన్సూరెన్స్ చేస్తేనే లారీలలో డీసీయం లలో వస్తుంటే చనిపోతే వెంటనే గొర్రెకు బదులుగా గొర్రెలు ఇస్తాను అని ఒక్క యూనిట్ కు మూడు క్వింటల్ల దాణ బస్తాలు అడవిలో గొర్రెలకు జ్వరం వస్తే గొర్రెల కాపరి ఇంటికి పోయి వచ్చేసరికి గొర్రెలు భారీ ప్రమాదంలోకు పోతాయి. అని ఒక్క యూనిట్ కు ఒక్క మందుల కిట్టు ఇస్తానాని గొర్రెలపంపిణీ ప్రారంభం రోజున స్వయంగా ముఖ్య మంత్రిగారు హామీలిచారు కాని ఏ ఒక్కటికూడ ఆచరణలో ఇవ్వలేకపోయారు. మొదటి విడుతలో ముసలి గొర్రెలు. చిన్నపిల్లలు పంపిణీ చేశారు. గొర్రెలు పంపిణీలో కొంతమంది డాక్టర్ లు. బ్రోకర్స్ మాత్రమే బాగుపడ్డారు కాని గొల్లకురుమలు మాత్రం బాగుపడలేదు అని గొర్రెల పంపిణీ లో అనేక అక్రమాలు జరుతున్నాయి అని గొల్లకురుమలు మొత్తుకున్న ప్రభుత్వం పెడచేవి పెట్టలేదు. ఇక రెండోవిడుత గొర్రెల పంపిణీకి రెండోసారి అధికారంలోకి రావడానికి గొల్లకురుమలచే డీడీలు తీపించి ఐదు సంవత్సరాలు గడిచిన గొర్రెలు పంపిణీ చేయలేకపోయారు. రాష్ట్రములో ఉపఎన్నికలు వచ్చినకాడ గొర్రెలు పంపిణీ చేసుడు తరువాత మళ్లీ అదేతంతుగా వ్యవహరించిన తీరు ప్రజలందరికి తెలుసనీ అన్నారు. కాని మునుగోడు ఎన్నికల ముందు గొల్లకూరుమలకు నగదు బదిలీ చేస్తానని వారి బ్యాంక్ అకౌంట్ లో నగదు వేసి మల్లి డబ్బులు తుసుకోకుండ గొర్రెల కాపరుల బ్యాంక్ ఖాతాలను లాక్ చేశారు ఎన్నికలు ఐపోయిన తరువాత నగదు అని మాటిచ్చి గెలిచిన తెల్లారి మటమార్చి మల్లి పాత పధ్ధతిలో గొర్రెల పంపిణీ చేస్తానని పేపర్ ప్రకటనలో వచ్చిన తీరు చూసీ గొల్లకురుమలు మరోసారి మోసపోయాము అని అనుకున్నారు నగదు బదిలీ ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గొల్లకారుమలను ఏకం చేసి వచ్చే సాధారణ ఎన్నికల్లోసర్కార్ కు ఘోర పరభావం తప్పదని హెచ్చరించారు. సీద్ధిపేట జిల్లాలో గ్రామాలలో గొర్రెల షెడ్స్ ఒక్కదగ్గర నిర్వహించినట్లు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్స్ నిర్వహించాలని. రెండోవిడుత గొర్రెల పంపిణీ నగదు బదిలీ సంక్రాతి పండుగ వరకు చేయకుంటే జనవరి లాస్ట్ వారంలో GMPS ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి గొల్లకూరుమలను చైతన్యం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఉద్యమం చేయుటకు సన్నద్ధం చేస్తామని అన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దుడిమెట్ల సోనాబాబు. మేకల మల్లేష్. గుండా వెంకన్న. ఎక్కల రాజబిరయ్య. జిల్లా సహాయ కార్యదర్శిలు కన్నెబోయిన బాలరాజు. జిట్టాబోయిన రమేష్.బైకాని ఐలేష్.మాధరబోయిన కరుణాకర్. వివిధ మండల అధ్యక్షులు. కార్యదర్శులు.గద్ద రాజు.ఆవుల ప్రభాకర్.ఉలిగిల్ల చంద్రయ్య. వేల్పుల రాజు. జల్లెల రవి. కుక్కల రాజు. బెల్లి అజయ్.తదితరులు పాల్గొన్నారు.
*డిమాండ్స్*
- గొల్లకూరుమలకు నగదు బదిలీ చెయ్యాలి.
- పశువైద్యాశాలలోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీచేయాలి.
- శిథిలావస్థలో ఉన్న పశువైద్య కేంద్రాలను వెంటనే కొత్తగా నిర్మాణం చేపట్టాలి.
- అన్ని పశువైద్యకేంద్రాలలో గొర్రెల మేకలకు సరిపోను వ్యాక్స్ న్. వాట్టికి సంబందించిన మందులు ఉచితంగా ఇవ్వాలి.
- సోసైటీలలో కొత్త సభ్యులను చేర్చుకొని.సోసైటీ ఎన్నికలు నిర్వహించాలి.
- జీవో 559.1016 లను పూర్తి స్థాయిలో అమలు పరుచాలి.
- గొర్రెలకు ఉచితంగా (ఇన్సూరెన్స్) బీమాపథకం చేపట్టాలి.
- ప్రమాద వైశ్యత్ గొర్రెల కాపరి చనిపోతే 10లక్షలు ఎక్స్ గ్రేసీయా చెల్లించాలి.
- 50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపారులకు నెలకు మూడు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలి..
- డిగ్రీ చదివిన గొల్లకురుమ పిల్లకి 30 లక్షలు ఎలాంటి షూరిటీ లేకుండ లోన్ సౌకర్యం కల్పించి గొర్రెలు పెంపకం కోసo ఋణం సౌకర్యం కల్పించాలని
ఇట్లు
గొర్రెల మేకల పెంపకందారుల సంఘం(GMPS) చిల్పూర్ మండల కార్యదర్శి ఆవుల ప్రభాకర్
సెల్ :-9182810131