
కార్యదర్శికి వినతిపత్రం అందజేసిన-బాధితులు,నాయకులు
ఎమ్మార్పీఎస్ మరియు ఎమ్మెస్పీ నాయకులు
కార్యదర్శికి వినతిపత్రం అందజేసిన-బాధితులు,నాయకులు
గొల్లపల్లి అనిల్ ఎమ్మార్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో
తెలుగు గళం ధర్మసాగర్ న్యూస్
పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు ముప్పారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు
గొల్లపల్లి అనిల్ ఎమ్మార్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మరియు ఎమ్మెస్పీ మండల అధ్యక్షుడు ఎం.డీ శంషుద్దీన్
ల ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు,గీత, నేత, వికలాంగుల తో గ్రామ పంచాయతీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. అనంతరం అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తక్షణమే
వృద్ధులకు వితంతువులకు గీత నేత కార్మికులకు 2000/- నుండి 4,000/- వరకు పెంచాలని వికలాంగులకు 4000/- నుండి 6000/- కు పెంచాలని నరాలు చచ్ఛుబడిన వారికి 15000/-
ఆసరా పెన్షన్ పెంచాలని ఇట్టి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుక వెళ్లాలని కార్యదర్శి కి మెమోరాండం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో
గ్రామ ఎమ్మార్పిఎస్ నాయకులు,వృద్ధులు, వికలాంగుల,వితంతువులు, నేత, గీత బీడీ కార్మికులు తదితరులు, పాల్గొన్నారు.