గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది
భూపాలపల్లి నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధిని ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామంలో నరేగా మరియు ఎస్డిఎఫ్ నిధులతో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు.మహిళలు కోలాటాలతో సంప్రదాయబద్ధంగా ఆతిథ్యమిచ్చారు.అనంతరం గ్రామ కార్యదర్శిని సన్మానించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధి మరియు సంక్షేమం ద్వంద్వ చక్రాలు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలను ఆర్ టి సి బస్సుల ఓనర్లుగా చేయడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు గ్రామాలు మరింత ముందుకు నడిపే మార్గాలే అన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
తరువాత చెన్నాపూర్ మరియు రేగొండ మండలంలోని రూపిరెడ్డి పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే జీఎస్సార్ ప్రారంభించారు. రైతులతో మాట్లాడిన ఆయన రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుంది.నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి గిట్టుబాటు ధరలు పొందాలి అని సూచించారు.
రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి ఆహ్వానం
చెన్నాపూర్ పర్యటన సందర్భంగా భాగిర్దిపేట, దుంపిల్లపల్లి గ్రామాలకు చెందిన గౌడ సమాజ ప్రతినిధులు, రేగొండ మండలం భాగిర్దిపేటలో జరగనున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ తొలి వార్షికోత్సవానికి రేపు మంగళవారం విచ్చేయాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం అందజేశారు.
ఈ కార్యక్రమాలలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.