
గ్రామీణ కళలను ఆదరించాలి
మరిపెడ పట్టణంలోని రామాలయం పక్కన గల కుడితి మహేందర్ రెడ్డి ఇంటి ఆవరణలో గత 40 రోజులుగా నిర్వహిస్తున్న కోలాటాల శిక్షణ ముగింపు కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు హాజరై కోలాట ప్రదర్శనలను తిలకించారు.కోలాటాలు మన సంస్కృతి లో భాగమని,ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని తెలిపారు.కోలాట శిక్షణ తీసుకున్న యువతులను,మహిళలను ఆయన శుభాకాంక్షలు తెలిపారు.. కోలాటాల శిక్షణ నిచ్చిన గుండెపుడి గ్రామానికి చెందిన గుండగాని ఉప్పలయ్యను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు సింధూర కుమారి, రామడుగు అచ్చుత రావు మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న,తేజావత్ రవీందర్,గుగులోతు రాంబాబు,విసారపు శ్రీపాల్ రెడ్డి కౌన్సిలర్ల రేఖ లలిత వెంకటేశ్వర్లు, మాచర్ల స్రవంతి భద్రయ్య, బొడ శ్రీను, దిగజర్ల ముకేష్ మార్కెట్ డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, గందశిరి కృష్ణ, బోడ భాస్కర్ చరణ్ కాలనీ మహిళా మణులు తదితరులు పాల్గొన్నారు