హన్మకొండ 31వ డివిజన్ న్యూ శాయంపేట సుజిత్ నగర్ లో జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డి నేటర్ కేతిడి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో బస్తివాడలో దుప్పట్లు మరియు పండ్లు పంపిణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు హాజరై బస్తివాడలో నివాసం ఉంటున్న నిరుపేద మహిళా కూలీలకు దుప్పట్లు మరియు పండ్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సోషల్ మీడియా కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ నేహళ్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు అంబేద్కర్ రాజు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఒబిసి డిపార్టుమెంటు వైస్ చైర్మన్ సిరబోయిన సతీష్, బండారి మురళి, కే. కృష్ణ, వెల్దండి రమేష్, ఎలకాటి రాము, నర్మెట్ట అశోక్, పి. రమేష్, గండ్రాతి యాదగిరి, పైడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.