
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఖమ్మం జిల్లా అధ్యక్షులు వేగినాటి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలో ఉండేటువంటి యాచకులకు, వృద్ధులకు, భోజనాలు పంపిణీ చేశారు, ఉదయ్ మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని, ప్రభుత్వ ఏర్పాటుకు NSUI కీలక పాత్ర పోషిస్తుంది అని,ప్రతి ఒక్క విద్యార్థి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన అన్నారు…ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షుడు గుగులోత్ మోహన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగు నవీన్ కుమార్ , సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సోహెల్, ఆదర్శ్, NSUI జిల్లా నాయకులు సయ్యద్ ఆసీఫ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.