
ఘనంగా ఇస్మాయిల్ జన్మదిన వేడుకలు.
ఐజేయు యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ జన్మదిన వేడుకలను కోదాడ ఎలక్ట్రానిక్ ,ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో గురువారం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు . సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్, టి డబ్ల్యూ జే హెచ్ 143 యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరికిషన్,ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు పడిశాల రఘు, టీ డబ్ల్యూ జె హెచ్ 143 యూనియన్ నియోజకవర్గ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి తోటి జర్నలిస్టు మిత్రులకు అందజేశారు .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కష్టకాలంలో ప్రతి జర్నలిస్టుకు అండగా నిలబడిన వ్యక్తి ఇస్మాయిల్ అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో కరోనాతో బాధపడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున సహాయం అందేలా కృషి చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదంలో రాష్ట్రంలో ఏ గ్రామీణ ప్రాంత విలేకరి గాయపడ్డ వెంటనే సదరు ఆసుపత్రికి కానీ ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించి వారికి హెల్త్ కార్డు నుండి వైద్యం త్వరితగతిన అందేలా కృషి చేసే వారిని గుర్తు చేశారు. ఏ జర్నలిస్టు మిత్రుడు ఫోన్ చేసిన వెంటనే ఫోన్ రిసీవ్ చేసి సమస్య అడిగి తెలుసుకునే వారని, జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల మీద తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి స్థలాల మంజూరయ్యేలా కృషి చేశారన్నారు. జర్నలిస్టులకు అండగా నిలబడుతున్న ఇస్మాయిల్ భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రరావు, రమేష్ , శ్రీకాంత్, సురేష్, వెంకటనారాయణ, గోపాల్, గోపి, శ్రీను, శ్రీహరి, నరేష్, నజీర్, బసవయ్య, షాకీర్, హరీష్, మహమూద్, అత్తాబ్, అతహార్,సైదులు తదితరులు పాల్గొన్నారు