ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం
హనుమకొండ జిల్లాగ్రంథాలయ సంస్థ హనుమకొండలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గ్రంథాలయ వారోత్సవ 7వ రోజు,గురువారం (20-11-2025) నాడు విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు మహ్మద్ అజీజ్ ఖాన్ అధ్యక్షత వహించారు.ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మొదట గ్రంథాలయంలోని సరస్వతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ..“గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత ముఖ్యమో,పుస్తకాలు కూడా అంతే ముఖ్యమైనవి.యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని,తల్లిదండ్రులు-గురువుల పట్ల కృతజ్ఞతాభావంతో ముందుకు సాగాలి”అని సూచించారు.అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు.ప్రస్తుతం చైర్మన్గా ఉన్న మహ్మద్ అజీజ్ ఖాన్ గ్రంథపాఠకుల కోసం చేపడుతున్న సేవలను,అభివృద్ధి పనులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.“ఇకముందు కూడా నిరుద్యోగులు,విద్యార్థులకు ఉపయోగపడే మరిన్ని వనరులను గ్రంథాలయంలో అందుబాటులోకి తెచ్చేందుకు నా వంతు సహకారం అందిస్తాను”అని ఎమ్మెల్యే తెలిపారు.చైర్మన్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ,గ్రంథాలయంలో ఇప్పటికే ఉన్న వసతులను మరింత మెరుగుపరుస్తున్నామని,మరో మూడు నెలల్లో పాఠకుల కోసం ఆడిటోరియం,అలాగే అమ్మాయిల కోసం ప్రత్యేక రీడింగ్ హాల్ ప్రారంభించనున్నామని ప్రకటించారు.వారోత్సవాల సందర్భంగా వివిధ రంగాలలో పోటీల్లో పాల్గొని విజేతలైన పాఠశాల-కాలేజీ విద్యార్థులు,గ్రంథపాఠకులకు ఎమ్మెల్యే మరియు చైర్మన్ చేతుల ద్వారా బహుమతులు ప్రధానం చేశారు.కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీమతి కే.శశిజా దేవి,కార్పొరేటర్లు తోట వెంకన్న,నెక్కొండ కవిత కిషన్,ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు బి.విక్రమ్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బిన్ని లక్ష్మణ్,కందుల సృజన్ కాంత్,ఆర్టీవో మెంబర్ పలగొండ సతీష్,లైబ్రేరియన్లు మలుసూరు,పురుషోత్తం రాజు,జూనియర్ అసిస్టెంట్ పి.సంతోష్ కుమార్,రికార్డ్ అసిస్టెంట్ మమత,ఇంటర్నెట్ సెక్షన్ నిర్వాహకులు రాజేష్,గ్రంథాలయ సిబ్బంది,గ్రంథపాఠకులు,వివిధ కళాశాలల,పాఠశాలల విద్యార్థులు,ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.