ఘనంగా తెలుగు గళం న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రజాసేవే లక్ష్యంగా జర్నలిజం కొనసాగాలి – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఎమ్మెల్యే చేతుల మీదుగా 2026 సంవత్సర క్యాలెండర్ విడుదల
ప్రాంతీయ సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో నిరంతరం కృషి చేస్తున్న తెలుగు గళం న్యూస్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర నూతన క్యాలెండర్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రేగొండ పట్టణంలో సౌహార్దపూర్వక వాతావరణంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి స్టాఫ్ రిపోర్టర్ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే కు క్యాలెండర్‌ను అందజేశారు.అనంతరం క్యాలెండర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, అందులో పొందుపరిచిన అంశాలను అభినందిస్తూ తెలుగు గళం న్యూస్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలకమైన బాధ్యత ఉందని అన్నారు. ప్రజల సమస్యలను నిస్సంకోచంగా వెలుగులోకి తీసుకువచ్చి, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో తెలుగు గళం న్యూస్ విశేషంగా కృషి చేస్తోందని ప్రశంసించారు. ప్రజలతో నేరుగా మమేకమై, గ్రామీణ ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వార్తలను ప్రసారం చేయడం అభినందనీయమని తెలిపారు.భవిష్యత్తులో కూడా బాధ్యతాయుతమైన, నైతిక విలువలతో కూడిన జర్నలిజాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, భూపాలపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల బిక్షపతి, గండి తిరుపతి, మైస బిక్షపతి, ఉమ్మడి మండలాల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య, ఓబీసీ జిల్లా నాయకులు పొనుగంటి వీరబ్రహ్మం పాల్గొన్నారు.అలాగే రేగొండ సర్పంచ్ మౌనిక అజయ్, ఉప సర్పంచ్ ఎలదండి నరేష్, మాజీ ఎంపీపీ పున్నం రవి, మాజీ ఎంపీటీసీ పట్టేమ్ శంకర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ,ప్రజలకు అవసరమైన సమాచారాన్ని వేగంగా, నిజాయితీగా అందిస్తున్న తెలుగు గళం న్యూస్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తూ, సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకొని జర్నలిజాన్ని కొనసాగించాలని కోరారు.కార్యక్రమం చివర్లో తెలుగు గళం న్యూస్ యాజమాన్యం,విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేయగా,కార్యక్రమం ఉత్సాహభరితంగా ముగిసింది.