విద్యార్దుల్లో నైపుణ్యం వెలికి తీసి, ఉత్సహాన్ని కలిగించడమే స్వపరిపాలనదినోత్సవమనిప్రధానోపాధ్యాయులు ఎన్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం మునగాల మండల పరిధిలోని నర్సింహాలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా వారు మాట్లాడుతూ పిల్లలు అందరూ సంతోషంగా స్వపరిపాలన దినోత్సవంలో పాల్గొన్నారన్నారు. పిల్లలు అనుభవాలను పంచుకుని మంచి బోధన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి శ్రీనివాసరావు, ఎస్ శ్రీనివాసరావు, హరికృష్ణ, కే కరుణ, పి ప్రకాష్, పి శ్రీకాంత్, ఇందిరమ్మ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.