
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి శభాన అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జనగామ జిల్లా కమిటీ సమావేశం స్థానిక ఆఫీసు లో జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇ ర్రి అహల్య ఎండి షబానా పాల్గొని మాట్లాడారు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని ఐద్వా మూడు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తుందన్నారు 2014 ఎన్నికల ముందు బిజెపి మేము అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును తెస్తామని ఎన్నికల వాగ్దానం చేసిందన్నారు కానీ మహిళల పట్ల చిత్తశుద్ధిలేని బిజెపి 9 సంవత్సరాలలో మహిళా బిల్లుని ప్రవేశపెట్టలేదన్న రూ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని మహిళల అసంతృప్తిని నుండి దృష్టి మరల్చడానికి మహిళా ఓటర్లకి గాళం వేయడం కోసం హడావుడిగా పార్లమెంట్ ముగింపు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇచ్చినట్టే ఇచ్చి అందని ద్రాక్ష లాగా తక్షణమే అమలు చేయకుండా బిల్లు ప్రవేశ పెడుతూ జనగణన నియోజకవర్గ పునర్విభజన తర్వాతే బిల్లు అమల్లోకి వస్తుందని చెప్పడంలోనే మహిళల పట్ల కపట ప్రేమ కనిపిస్తుందన్నారు ధరలు పెరుగుతున్న పట్టించుకోని మోడీ మణిపూర్ మారనకాండను మరిపించి మహిళల దృష్టిని మళ్ళించడం కోసం తొమ్మిదిన్నర సంవత్సరాలలో గుర్తుకురాని మహిళా రిజర్వేషన్ బిల్లును ఉట్టి మీది చేపల కూరల మహిళలకు అందకుండా చేసిందన్నారు పార్లమెంటులో మెజార్టీ సభ్యులు ఉన్నారని బిజెపి ఏ నిబంధనలు లేకుండా అన్ని బిల్లులు పాస్ చేసుకున్న బిజెపి మహిళా బిల్లుకు వచ్చేసరికి ఇంతకాలం జాప్యం చేసి హడావిడిగా అమల్లోకి రాని బిల్లు తెచ్చింది అన్నారు ఇప్పటికైనా మహిళా బిల్లు పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అమలు చేయాలన్నారు లేనిచో నీ కపట ప్రేమకు మహిళలు మోసపోరని ఏ ఎన్నికల కోసమైతే మహిళా బిల్లును తెచ్చారు అర్థం చేసుకుని ఎన్నికల్లో బిజెపి పార్టీని గద్దె దించడం కాయం అని హెచ్చరించారు సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చీర రజిత సహాయ కార్యదర్శి మోకు భవాని ఉపాధ్యక్షురాలు కమిటీ సభ్యులు సిహెచ్ శ్రీలత డి రాములమ్మ ఎండి గౌసియా చంద్రకళ పాల్గొన్నారు