telugu galam news e69 news
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం పామిడి పట్టణం లో గల ప్రభుత్వ పాఠశాలకు 24-6-2024.సోమవారం నాడు 2003 సంవత్సర పదవతరగతి పూర్వ విద్యార్థిని విద్యార్థుల జ్ఞాపకార్థం 4 విద్యుత్ లైట్లు,స్థంభం మరియు సామాగ్రినీ స్థానిక పామిడి పట్టణంలో ఉన్న టీ సి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థిని విద్యార్థులు అందించడం జరిగినది.వాటి ఖర్చు 25000 రూపాయలు అయ్యిందని వెల్లడించారు. చదివిన పాఠశాలకు విద్యుత్ లైట్ లు అందించినందుకు ఎంతో సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ గాంధీ. మిత్రులు హనీఫ్, చిరంజీవి,సూరీరావు, బెస్త సూరి,చాకలి రాజేష్,ఇంతియాజ్,విఠలరావు,చిన్ని,చాకలి సురేష్,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు,పీడీలు పాల్గొన్నారు.