
PALAKURTHY
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రము రోడ్డు విస్తరణలో భాగంగా చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని తొలగించి
సుమారుగా పోలీస్ స్టేషన్లో రెండు సంవత్సరాలు నుండి పక్కన వుంచిన విషయం ఆగస్టు నెలలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితికి తెలియగ
రాష్ట్ర కమిటీ తక్షణం స్పందించి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పాలకుర్తి మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు నైతిక బాధ్యత వహిస్తూ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తిరిగి యధా స్థానంలో విగ్రహాన్ని స్థాపించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయం పై స్పందించి తక్షణమే చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్యులు అధికారులకు ఆదేశాలు జారిచేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసిన రాష్ట్ర కమిటీ. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో రజకులపై జరుగుతున్న అన్యాయాలపై ఎక్కడికక్కడ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి తక్షణమే స్పందించి పోరాడుతున్న సంఘం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి అని రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక హైదరాబాద్ జిల్లా నల్లకుంట శతాబ్దిభవన్లో 7-9-2023 గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది.ట్యాంక్ బండ్ పై చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ప్రభుత్వం ఇకనైనా ఏర్పాటు చేసి రజక కులస్తులపై తన చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్ రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య ,జనగామ జిల్లా నాయకులు మిన్నలాపురం జలందర్ ,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ్రాతి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ వెంకటేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొలాస శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి తిప్పరాజు కృష్ణ, నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్లనర్వ శ్రీశైలం, కాచిగూడ అధ్యక్షులు సిహెచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.