
స్మశాన వాటిక భూ వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని ఎమ్మార్వోని కలిసిన రజక నాయకులు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో స్మశాన వాటిక భూవివాదంలో వారం రోజుల క్రితం రజకులపై దాడి చేసిన ముదిరాజ్ కులస్తుల విషయం గ్రామ అధ్యక్షులు జూపల్లి జంగయ్య ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక స్పందిస్తూ ఈ రోజు 29-9-2023 శుక్రవారం గ్రామ కూడలివద్ద బైటాయించి న్యాయం చేయాలని కోరారు.దాడి చేసిన వారిపై కఠినమైన చర్య తీసుకోవాలని బాధితులకు సరైన న్యాయం జరగాలని ఎస్సై ని కోరటం జరిగింది .అదేవిధంగా స్మశాన వాటిక భూ వివాద విషయంలో ఎమ్మార్వో ను కలిసి భూమిని సర్వే చేయించి రజకులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరటం జరిగింది.అదేవిధంగా రాష్ట్రంలో రజక కులస్తులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు .
సౌత్ జోన్ కన్వీనర్ గోలనుకొండ భాస్కర్ మాట్లాడుతూ చీకటిమామిడి రజక కులస్తులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ స్మశాన వాటిక భూవివాదాన్ని పరిష్కరించాలని కోరారు.
జిల్లా అధ్యక్షురాలు బండిరాల సుశీల మాట్లాడుతూ జిల్లాలో గతంలో అనేక దాడులు జరిగాయని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని పోలీస్ అధికారులను కోరారు. అదేవిధంగా ఈరోజు చీకటిమామిడి రజకులపై దాడిని తీవ్రంగ ఖండిస్తు న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా చలో చీకటిమామిడి పిలుపునిస్తామని వారన్నారు
ఈ కార్యక్రమంలో బొమ్మలరామారం పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ ,తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంపల్లి జంగయ్య, బీబీనగర్ మండల అధ్యక్షులు గాండ్ల అశోక్ ,ఆలేరు మండల అధ్యక్షులు మామిడాల సోమయ్య, చీకటిమామిడి గ్రామ రజక కులస్తులు,కొలనుపాక గ్రామ రజక నాయకులు వివిధ గ్రామ రజక నాయకులు హాజరు కావడం జరిగింది.