చీఫ్ ప్లానింగ్ అధికారులతో వరంగల్ ఎంపీ సమీక్ష సమావేశం
ఎంపీ నిధుల నుంచి రూ.8 కోట్ల 30 లక్షలు మంజూరు
మూడు నెలల్లో పనులు ప్రారంభించకపోతే రద్దు
అభివృద్ధి పనుల పురోగతి పబ్లిక్ డొమైన్లో ఉంచాలి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని ఎంపీ ఛాంబర్లో చీఫ్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల కోసం ఎంపీ నిధుల నుంచి మొత్తం రూ.8 కోట్ల 30 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.ఈ నిధులకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చిన తేదీ నుంచి మూడు నెలల లోపు పనులు ప్రారంభించాలని,లేదంటే ఆ పనులను రద్దు చేయాలని అధికారులను స్పష్టంగా ఆదేశించారు.ఎంపీ నిధుల ద్వారా చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి సంబంధించిన పురోగతి వివరాలను తప్పనిసరిగా పబ్లిక్ డొమైన్లో ఉంచాలని,ప్రజలకు పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.పనుల అమలులో ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.నియోజకవర్గంలోని మౌలిక వసతుల అభివృద్ధి,రోడ్లు,డ్రైనేజీలు,తాగునీటి సరఫరా,ఆరోగ్యం,విద్య వంటి రంగాల్లో ప్రజలకు ప్రత్యక్షంగా మేలు చేసే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీ ఆదేశించారు.అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత కాలపరిమితిలోనే పూర్తి చేయాలని అధికారులను కఠినంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో అధికారులు ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు,పెండింగ్ ప్రాజెక్టుల స్థితి,భవిష్యత్ ప్రణాళికలను ఎంపీకి వివరించారు.ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య సూచించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ ప్లానింగ్ అధికారులు సత్యనారాయణ రెడ్డి,చంద్రకళ,కొట్యా నాయక్,బాబురావు,పంచాయతీరాజ్ అధికారులు ఆత్మారామ్,రమేష్ బాబు,కిషన్,సతీష్ బాబు,ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు,టీజీఈడబ్ల్యూఐడిసీ అధికారి కిషన్,డిడబ్ల్యుఓ రాజమణి,మిషన్ భగీరథ అధికారి శ్రీకాంత్తో పాటు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల ప్రతినిధులు,ఇతర అధికారులు పాల్గొన్నారు.