bhadradri kothagudem news
-అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జీఎస్సార్
గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
నియోజకవర్గంలోని చెన్నాపూర్ గ్రామం రూపిరెడ్డిపల్లి, దామరంచపల్లి క్రాస్ రోడ్డు, చిన్నకోడెపాక, విజ్జయ్యపల్లి మీదుగా రాజక్కపల్లి గ్రామం వరకు ఆయా గ్రామాల ప్రజలకు మంచి నీటి సౌకర్యం కొరకు తక్షణమే సంబంధిత శాఖల అధికారులు లైన్ ఎస్టిమేట్ తయారు చేసి ఇవ్వాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు సూచించారు.ఈరోజు సాయంత్రం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూ ఎస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెన్నాపూర్ గ్రామం నుండి రాజక్కపల్లి గ్రామం వరకు మంచి నీటి సౌకర్యం కొరకు లైన్ ఎస్టిమేట్ చేయాలని కోరారు.అదేవిధంగా దామరంచపల్లి,చిన్నకోడెపాక,విజ్జయ్యపల్లి,రాజక్కపల్లి గ్రామాల పరిధిలో ఉన్న లోలెవల్ వంతెనలు దెబ్బతిన్నాయని వాటిని మరమ్మత్తులు చేయాలని పీఆర్ అధికారులను కోరారు.నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు, మంచి నీటి పైపులైన్లు, సైడ్ డ్రైనేజీ తదితర పనుల పురోగతిపై ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.