
ఈ69న్యూస్ జనగామ:రైతుల కష్టానికి తగిన మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో,జిల్లా వ్యాప్తంగా 258 ఐకేపీ,పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి,సజావుగా కొనుగోలు జరుగుతోందని తెలిపారు.వీటిలో ప్రత్యేకంగా చీటకోడూరు ఐకేపీ కేంద్రం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.2023–24 రబీ సీజన్లో 177 మంది రైతుల నుంచి 11,104 క్వింటాళ్లు,ఖరీఫ్ 2024–25లో 192 మంది నుంచి 12,990 క్వింటాళ్లు,ప్రస్తుత రబీ 2024–25లో ఇప్పటివరకు 497 మంది రైతుల నుండి 38,104 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని తెలిపారు.గత రబీ సీజన్లో వచ్చిన సమస్యలను పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహన్ పరిశీలించి సూచించిన ప్రకారం ఈసారి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కొనసాగుతోందన్నారు.అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి,రైతుల పక్షాన నిలవాలని కలెక్టర్ సూచించారు.