
E69 news జఫర్ఘడ్ ఫిబ్రవరి 06
సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జఫర్గడ్ సబ్ స్టేషన్ ముందు రైతులకు పగటిపూట 3ఫేజ్ కరెంట్ నిరంతరాయంగా ఇవ్వాలని ధర్నా నిర్వహించి ఎఇకి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యులు వడ్లకొండ సుధాకర్ గుండెబోయిన రాజు మాట్లాడుతూ కరెంటు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది రైతులకు తెలియడం లేదని,విద్యుత్ అధికారులను అడిగితే తమకేం తెలియనట్టు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు మాత్రం 24 గంటలు కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితి గ్రామాల్లో లేదన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన త్రీఫేస్ విద్యుత్తును రైతులకు పగటిపూట నిరంతరాయంగా షిఫ్టు లేకుండా ఒకేసారి ఇవ్వాలన్నారు.విద్యుత్ లైన్ల కింద చెట్లు పెరిగి లైన్లకు తగులుతూ ట్రాన్స్ఫారంలో ఫీజులు తరచుగా పోతున్నాయని,ఓవర్ లోడ్ ఉన్న ప్రదేశాల్లో అదనంగా ట్రాన్స్ఫార్మర్ను బిగించి ఓవర్ లోడ్ ను నియంత్రించాలని అన్నారు.లేనిపక్షంలో రైతులందరిని సమీకరించి దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వేల్పుల చిన్న రాములు పెద్ద రాములు యాదవ్ నక్క యాకయ్య ఎండి షబానా రోజ గంగరాజు ఎర్ర రవి శాంతం సమ్మయ్య ఆర్ రజిత లక్ష్మి రోజా తదితరులు పాల్గొన్నారు.