జనగామ జిల్లా జఫర్ఘడ్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ముస్లింలు సోదరులు భక్తి శ్రద్దలతో ఈదుల్ అజిహా (బక్రీద్ పండుగ) ను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ముస్లింలు నూతన దుస్తువులు ధరించి తక్బీర్ లు చదువుతూ ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు అలాయ్ బలాయ్ తీసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు.తమ పూర్వీకులను స్మరించుకుంటూ స్మశానంల వద్దకు వెళ్ళి సమాధుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం ఇబ్రాహీం ప్రవక్త ఆచారంను అనుసరించి జంతువులను ఖుర్బానిలు ఇచ్చారు.మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో అహ్మదీయ ముస్లిం జమాఅత్ ఆధ్వర్యంలో స్థానిక ఈద్గాహ్ వద్ద అందరూ ఏకమై భక్తి శ్రద్దలతో ప్రత్యేక నమాజ్ చేశారు.అనంతరం అహ్మదీయ మౌల్వీ ముహమ్మద్ నూరుద్దీన్ ప్రత్యేక నమాజ్ చేయించి బక్రీద్ ప్రత్యేకత గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సదర్ షరీఫ్,నాయబ్ సదర్ బషీర్,మాజీ సదర్లు మఖ్దూం అలీ,ఖాసిం,ఆజిమియ,యాకూబ్ పాష,బాష,వలీపాష,నాసర్,ఖాదర్,హుస్సేన్,అన్వర్,అహ్మద్ పాష,యాకూబ్ డాన్ నజీర్ అంకూషావలీ,అబ్బాస్,చాంద్ పాష,రియాజ్ ఇమాం,మౌలాన్,నబిసాబ్,హాజీమియ,రషీద్,షాబద్దీన్,పిల్లలు స్త్రిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.