జఫర్ఘడ్లో మే డే ఘనంగా-కార్మికుల ఐక్యతకు నినాదాలు
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని గ్రామాల్లో మేడే వేడుకలు స్ఫూర్తిదాయకంగా జరిగాయి.సీఐటీయూ,సీపీఎం జెండాలు ఎగురవేసి కార్మికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.నాయకులు రాపర్తి సోమయ్య,ఎండి షబానా,గుండెబోయిన రాజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక నిబంధనలను వ్యతిరేకిస్తూ గళమెత్తారు.తమ్మడపల్లి జి లో ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు,కళాకారులు పాల్గొన్నారు.