
ఈ69న్యూస్ వరంగల్:- జర్నలిస్టుల పట్ల రాష్ట్ర పాలకులు చూపిస్తున్న వివక్షను తీవ్రంగా వ్యతిరేకించాలని,సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చేపట్టిన జాప్యాన్ని ఇక భరించలేమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య స్పష్టం చేశారు.శనివారం వరంగల్ నగరంలోని కెమిస్ట్రీ భవన్లో జరిగిన టిడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా తృతీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన సోమయ్య జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని,ఏడాదిన్నర కాలంగా అధికారంలో ఉన్నా జర్నలిస్టులకు ఏ ప్రయోజనం కలగలేదని విమర్శించారు.జన చైతన్య యాత్రకు పిలుపు:-ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల జన చైతన్య యాత్ర” చేపట్టనున్నట్లు వెల్లడించారు.ప్రజల మద్దతుతో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని,సమిష్టిగా పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.చిన్న పత్రికలకు గుర్తింపు ఇవ్వాలి:-రాష్ట్రంలో అనేక చిన్న పత్రికలను ప్రభుత్వం గుర్తించకుండా అణచివేస్తోందని,అర్హత ఉన్న వారిని ఎంపానెల్మెంట్ చేయకుండా పైరవీలకు ప్రాధాన్యం ఇస్తోందని సోమయ్య ఆరోపించారు.కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేయాలని,జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశంలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మీడియా అకాడమీపై విమర్శలు:-రాష్ట్రంలో మీడియా అకాడమీని రెండు జర్నలిస్టు సంఘాలు తమ స్వంత ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నాయన్న ఆరోపణలు చేశారు.చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు,జర్నలిస్టుల పేరునే వినియోగించి రాజకీయ పదవులు పొందుతున్నారని మండిపడ్డారు.అనంతరం టిడబ్ల్యుజెఎఫ్ వరంగల్ నూతన కమిటీ ఎన్నిక
ఈ మహాసభలో వరంగల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జక్కుల విజయ్ కుమార్ (మెట్రో ఈవినింగ్) అధ్యక్షుడిగా,బొట్ల స్వామిదాస్(నవభారత్)కార్యదర్శిగా ఎంపికయ్యారు.ఇతర పదవుల్లో భానోత్ సురేష్,వెల్ది రాజేందర్,కుర్మిల్ల దుర్గారావు,బావండ్లపల్లి కిరణ్ కుమార్,ఆకోజు సాంబయ్య,బాదం సురేష్,స్వామినాదం,సైదులు తదితరులు ఎన్నికయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్,వల్లాల జగన్,కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్,కౌన్సిల్ సభ్యులు పొలుమారి గోపాల్,చుంచు అయిలయ్య,నీల నరేష్ బాబు,మిట్టపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.జర్నలిస్టులు పాలకుల ముందు తలవంచకూడదు:-జర్నలిస్టులు పాలకులకు ఊడిగం చేయకుండా,ప్రజల పక్షాన నిలిచి స్వతంత్రంగా ముందుకు సాగాలన్నారు.టిడబ్ల్యూజేఎఫ్ సంఘం జర్నలిస్టులకు అండగా ఉంటుందని,రాష్ట్రవ్యాప్తంగా ఇతర సంఘాల నుండి పెద్ద సంఖ్యలో సభ్యులు ఈ సంఘంలో చేరుతున్నారని తెలిపారు.