
జాతీయ జెండా కు ఘోర అవమానం
77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ జెండా కు ఘోర అవమానం జరిగిన సంఘటన మంగళవారం మండలంలోని బృందావనపురం గ్రామం లో చోటుచేసుకుంది. వివరాలు పరిశీలిస్తే గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ లో అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించిన.. జాతీయ జెండా ఆవిష్కరణ చేసే సమయం లో అధికారులు శ్రద్ధ కనపరచకపోవడం సోషనీయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. జాతీయ పతాకావిష్కరణ తలకిందులుగా ఆవిష్కరణకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.