
రుద్రమదేవి చోటా ఖాన్ కరాటే అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ నిర్వహించగా జఫర్గడ్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల రెసిడెన్షియల్ విద్యార్థినిలు జె.ఆమని,కె.శ్రావణి,డి.నిఖిత,ఎ.యమున,మరియు తమ్మడపల్లి(జి) గ్రామానికి చెందిన జడ్పీఎస్ పాఠశాల విద్యార్థులు జి.కృష్ణా సాగర్,ఆర్.సాత్విక్,జి.రుషివరుణ్,ఎ.దుర్గ ప్రసాద్ లు విజయం సాధించింది జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ అవార్డు గెలుపొందారు.ఈ సందర్భంగా విజేతలకు సినీస్టార్ సుమన్ బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.అనంతరం రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ లక్ష్మీరవి,మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నెపు రాజేంద్రం,కేజీబీపీ వ్యాయామ ఉపాధ్యాయురాలులను సుమన్ ఘనంగా సన్మానించారు.అలాగ్ జనగామ జిల్లా రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అధ్యక్షురాలు గుజ్జరి స్వరూప,మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు,స్వప్న,ఉపాధ్యాయుడు మహాలక్ష్మి తదితరులు విద్యార్థులను అభినందించారు.