
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా వేముల శ్రీను,పి.యాదగిరి
సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవమైన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2023 నూ మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శశాంక,మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర నాయక్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు చేతుల మీదుగా మరిపెడ మండలంలోని యం.పి.పి.యస్. అబ్బాయిపాలెం పాఠశాలలో పనిచేస్తున్న వేముల శ్రీను,యం.పి.పి.యస్ గుండెపుడి పాఠశాలలో పనిచేస్తున్న పొడిశెట్టి యాదగిరి కి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవార్డు మాపై మరింత బాధ్యత పెంచిందని అన్నారు.ఈ సందర్భంగా వారిని పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుడితి ఉపేందర్ రెడ్డి,మరిపెడ మండలంఅధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్,లింగన్న,నర్సిరెడ్డి, నామా,బాలు,వెంకన్న,లెనిన్ తదితరులు అభినందించారు