
హనుమకొండ జిల్లా నిరుద్యోగ యువతి,యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.ఆదివారం రోజున హనుమకొండ వాగ్దేవి కాలేజ్ ఆవరణలో నాయిని విశాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ దిగ్గజ సంస్థ Faxconn నేతృత్వంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ..మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట వేయడం జరిగిందని,ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు.కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుందని వెల్లడించారు.ప్రభుత్వేతర ఉద్యోగాల భర్తీకి స్థానిక యువతకు ఉద్యోగ కల్పన అవకాశాలు కల్పించేందుకు విశాల్ రెడ్డి ట్రస్ట్ ద్వారా నాన్ ఐటీ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ లోని ప్రముఖ మ్యానుఫ్యాక్చర్ సంస్థతో మొదలు మహిళా నిరుద్యోగ యువతులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.రానున్న రోజుల్లో ఐటీ,ఫార్మా,ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించి ప్రముఖ కంపెనీలతో జాబ్ మేళలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.హనుమకొండలోని యువతులకు మొదటగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన డాక్టర్ నాయిని గోదారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని మరియు బృందాన్ని ఎమ్మెల్యే నాయిని అభినందించారు.వరంగల్ పరిసర ప్రాంతాల యువతులకుఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ముందుకు వచ్చిన Foxconn సంస్థ ప్రతినిధి బృందాన్ని ప్రత్యేకంగా హనుమకొండ,వరంగల్ జిల్లా నిరుద్యోగుల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ కల్పనలు జరగాలని ఎమ్మెల్యే నాయిని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఫాక్స్కన్ సంస్థ ప్రతినిధి ఆనందం కుమార్,పరమేష్,పార్వతి వాగ్దేవి కాలేజ్ అధినేత దేవేందర్ రెడ్డి మరియు యువతులు పాల్గొన్నారు.
