•అన్ని తానై వేడుకలను నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి గుండాల శంకర్

ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
తెలంగాణ పూల పండుగ అయినటువంటి సద్దుల బతుకమ్మ పండుగను రేగొండ మండలం జూబ్లీ నగర్ గ్రామంలో మంగళవారం రోజు అంగరంగ వైభవంగా నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి ఆట స్థలాలలో మహిళామణులు,సోదరీమణులు యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నారు.తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను,కృతజ్ఞత భావాలను సద్దుల బతుకమ్మ పండుగ సమాజానికి తెలియజేస్తుంది,అన్ని వర్గాల ప్రజలు ధన బీద తేడా లేకుండా సమిష్టిగా జరుపుకునే పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం,తెలంగాణ ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ అని పంచాయతీ కార్యదర్శి గుండాల శంకర్ అన్నారు.ఈ సద్దుల బతుకమ్మ వేడుకలలో పంచాయతీ కార్యదర్శి గుండాల శంకర్ మహిళా మణులకు ఏ లోటు లేకుండా గ్రామ కమిటీ,ప్రజల సహకారంతో అన్ని తానై సద్దుల బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు శాడ రవీందర్ రెడ్డి, అలాగే గ్రామ పెద్దలు సుధాకర్, జెల్ల ప్రభాకర్,శనగల వెంకన్న,జంగేటి నరేష్,లెంకల రాఘవ రెడ్డి,గంట్ల వెంకటరమణారెడ్డి,లేంకల శ్రీనివాస్ రెడ్డి,మూలగుండ్ల శ్రీనివాస్,బత్తుల విష్ణు,గ్రామ యువత,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.