ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
ఏబివిపి చిట్యాల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా విద్యార్థులకు అవగాహన సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల రెండవ ఎస్సై హేమ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.మహిళా స్వాతంత్ర్య పోరాట చరిత్రలో కీలక స్థానాన్ని సంపాదించిన ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకుని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.సమాజంలో ఉన్నత స్థానం పొందడానికి మానసికంగా,శారీరకంగా దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని,లక్ష్య సాధన కోసం క్రమశిక్షణతో శ్రమించాలని సూచించారు.అదే విధంగా, విద్యార్థులు సోషల్ మీడియాకు అతిగా అలవాటు పడకూడదని, పాఠశాల దశ నుంచే ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలని వివరించారు.బాల్యవివాహాలు చదువు భవిష్యత్తును దెబ్బతీస్తాయని,అవి అసలు చేయకూడదని హితవు పలికారు. చదువుతో పాటు ఆటల్లో,సంస్కృతిలో ముందుండి కుటుంబం మరియు సమాజాన్ని గర్వపడేలా ప్రవర్తించాలన్నారు.
ప్రస్తుత కాలంలో యువతను తప్పదోవ పట్టిస్తున్న గంజాయి వినియోగం, బెట్టింగ్ యాప్లు వంటి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు ప్రత్యేకంగా సూచించారు.సమాజాన్ని నడిపించేది మహిళ అని,బలమైన సమాజానికి కారణం చదువుకున్న బాలికలేనని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏబివిపి రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజు కుమార్,నగర కార్యదర్శి అజయ్,ఇంచార్జి ప్రిన్సిపాల్ రవీందర్,నాయకు