వరంగల్ ఫిబ్రవరి 16గత వారం క్రితం టర్కీలో సంభవించిన భూప్రళయంలో వేల లక్షల సంఖ్యలో అనేకమంది మృత్యువాత పడడం జరిగింది.ఈ సంఘటన ప్రపంచం మొత్తాన్ని విషాదంతో నింపింది.బాధితులను ఆదుకునే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు చేపట్టడం జరుగుతుంది.ఇందులో భాగంగానే ఓ వ్యక్తి ఏకంగా 30 మిలియన్ డాలర్లను (దాదాపు 248 కోట్ల రూపాయలు)టర్కీ భూకంప బాధితులకు విరాళంగా అందజేసి నా పేరు వెల్లడించ వద్దని వెళ్ళిపోయాడు.ఈ వార్త ప్రపంచ మీడియాలో వైరల్ గా మారింది.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరూ అని మీడియా ఆరా తీస్తే తను పాకిస్తాన్ కు చెందిన ముజీబ్ ఎజాజ్ గా గుర్తించారు.తను పాకిస్తాన్ నుండి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు.వారు ఎలక్ట్రానిక్ వాహనం బ్యాటరీల పెద్ద వ్యాపార వేత్త,తన దగ్గర తొలుత డబ్బులు లేవని,తన వ్యాపారంకు సంబంధించిన ఆలోచనను బిల్ గేట్స్ మరియు అమెజాన్ చీఫ్ కు చెప్పడంతో 25మిలియన్ల డాలర్లు అప్పుగా ఇచ్చిందని.దానితో ఎలక్ట్రానిక్ వాహన బ్యాటరీ తయారు కంపెనీ ఏర్పాటు చేసుకుని ప్రపంచ మొత్తం వ్యాపారం చేస్తున్నాడని,ఆ కంపెనీ 21శతాబ్దంలోనే ప్రపంచ నెం1 గా ఎదిగిన కంపెనీ అని ఓ మీడియా సంస్థ కథనం వ్రాసింది.పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ముజీబ్ ఎజాజ్ సేవలను మెచ్చుకుంటూ వెబ్సైట్ లో ట్వీట్ చేశారు.తను పాకిస్తాన్ కు చెందిన వాడు కావడం గర్వకారణం అని తన పోస్ట్ లో పేర్కొన్నారు.ముజీబ్ ఎజాజ్ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.పాకిస్తాన్ లో మైనారిటీ లైన అహ్మదీయ ముస్లింల పై నిరంతరం దాడులు జరుగుతూనే ఉంటాయి.అహ్మదీయ మస్జిద్ లను ద్వంసం చేయడం,లాంటి సంఘటనలు కొన సాగుతూనే ఉన్నాయి.ఆ క్రమంలోనే ముజీబ్ ఎజాజ్ కుటుంబం పాకిస్థాన్ కు వలస వెళ్ళింది.అహ్మదీయ కమ్యూనిటీకి చెందిన హ్యూమానీటి ఫస్ట్ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి విపత్తులు సంభవించిన చోటల్లా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే విశ్వవ్యాప్త అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఐదవ ఖలీఫా ఆదేశాల మేరకు బాధితుల సహాయ సహకారాలు అందించారని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వెల్లడించింది.