టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ వారి రిక్రూట్మెంట్ డ్రైవ్
సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ,విద్యార్థులు మరోక ప్రముఖ కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇది ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ తయారీలో దిగ్గజ కంపెనీ అయిన టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ. వారి రిక్రూట్మెంట్ డ్రైవ్ లో ప్రొడక్షన్ ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సియస్ఈ)-12, కంప్యూటర్ సైన్స్ & మెషిన్ లెర్నింగ్ (సి యస్ యం)-11, ఏఐ&యంయల్, ఏఐ&డియస్-18, ఈసిఈ-04, ఈఈఈ-08 ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు 53+మంది ఎంపికైనట్లు కళాశాల ట్రైనింగ్&ప్లేస్ మెంట్ ఆఫీసర్ డాక్టర్:డియన్ వి కృష్ణారెడ్డి గారు తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్రతినిదులు విద్యార్థినీ,విద్యార్థులకు జాతీయస్థాయిలో ఇంటర్వ్యూలు నిర్వహించటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలకు కళాశాల నుంచి 92మంది విద్యార్థినీ,విద్యార్థులు హాజరు అయినట్లు చెప్పారు.ఈ ఇంటర్వ్యూలను కంపెనీ యొక్క విధానంలో రాతపరీక్ష,టెక్నికల్ రౌండ్, హెచ్ ఆర్ రౌండ్ మరియు మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా ప్రొడక్షన్ ట్రైనీ ఇంజినీర్లుగా 53మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగిందని కంపెనీ ప్రతినిదులు తెలిపారు. అదేవిధంగా ప్రొడక్షన్ ట్రైనీ ఇంజినీర్లుగా వివిధ కేటగిరిలో మొత్తం:53మంది ఉద్యోగాలు పొందినట్లు కళాశాల సెక్రటరియేట్&కరస్పాండెంట్ దాసరి.ప్రభాకర్ రెడ్డి పత్రిక ప్రకటనలో తెలియజేశారు.కళాశాల సెక్రటరియేట్&కరస్పాండెంట్ దాసరి.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి జాతీయస్థాయి రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ప్రొడక్షన్ ట్రైనీ ఇంజినీర్లుగా కొలువులు సాధిస్తున్న పరంపరలో మరో అద్భుత అవకాశం అందిపుచ్చుకున్న తమ కళాశాల ఆణిముత్యాలు అత్యున్నత ప్రతిభ కనబరచి ప్రొడక్షన్ ట్రైనీ ఇంజినీర్లుగా ఉద్యోగం సాధించారని వీరి యొక్క విద్య నైపుణ్యం క్షుణ్ణంగా పరిశీలించి వినూత్నవిషయాలపై విద్యార్థినీ,విద్యార్థులు కలిగి ఉన్న అవగాహన ద్వారా ప్రొడక్షన్ ట్రైనీ ఇంజినీర్లుగా వివిధ కేటగిరిల్లో ఇంజినీర్లుగా ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు.చివరి సంవత్సరం పూర్తి అయిన వెంటనే ఉద్యోగంలో చేరవలసి ఉంటుందని. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినీ,విద్యార్థులు చెన్నై,హైదరాబాద్ లలో ఉద్యోగం చేయవలసి ఉంటుందని. వీరికి జీతం సంవత్సరానికి Rs:2.4LPA ఇవ్వటం జరుగుతుందని చెప్పారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త,విద్యాధికులు,హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత,రాజ్యసభ సభ్యులు మరియు సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ బండి.పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి.అన్విద వర్చువల్ గా విద్యార్థినీ,విద్యార్థులకు అభినందనలు తెలియజేసారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్:వూటుకూరి.శేషారత్నకుమారి మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అనేక ప్రముఖ కంపెనీల మరియు సాఫ్ట్ వెర్ సంస్థల సేవలను వినియోగించుకోవడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు, తద్వారా విద్యార్థులకు ప్రాజెక్టులు, ఇంటర్నల్ షిప్ లు మరియు ఇండస్ట్రియల్ టూర్ లు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్:వూటుకూరి.శేషారత్నకుమారి, కళాశాల అన్నీఇంజనీరింగ్ బ్రాంచీల విభాగాధిపతులు,కళాశాల ట్రైనింగ్&ప్లేస్ మెంట్ ఆఫీసర్ డాక్టర్:డియన్ వి కృష్ణారెడ్డి అన్నీఇంజనీరింగ్ బ్రాంచీల విభాగాధిపతులు పాల్గొన్నారు. డిపార్ట్ మెంట్ ప్లేస్ మెంట్ ఇన్ చార్జీలు,కళాశాల ఫ్యాకల్టీ మెంబర్స్ ఉద్యోగ అర్హత సాధించిన విద్యార్థినీ,విద్యార్థులకు అభినందనలు తెలిపారు.