టీఎస్ జేఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా దొంగరి సురేందర్
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ “టీఎస్ జేఏ” రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా జర్నలిస్ట్ జర్నీ దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా కొనసాగుతున్న దొంగరి సురేందర్ ను నియమించారు.అసోసియేషన్ ప్రధాన కార్యాలయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి యూనియన్ నాయకులతో కలిసి సురేందర్ కు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడే ఏకైక యూనియన్ టీఎస్ జేఏ మాత్రమే అన్నారు. నియామక పత్రం అందుకున్న సురేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అసోసియేషన్ నాయకులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో యూనియన్ బలోపేతం కోసం తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు దుస్సా చంద్రశేఖర్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుంటి శ్రీనివాస్ సూర్యాపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు దేశ గాని వెంకట్ గౌడ్ సహాయ కార్యదర్శి తిరుపతి శ్రీనివాస్ ఆత్మకూరు మండల అధ్యక్షుడు కొండా రవి తదితరులు పాల్గొన్నారు