
ఈ69న్యూస్ హన్మకొండ
హన్మకొండ పట్టణ కేంద్రంలోని వడ్డేపల్లి పరిధిలో గల ట్యాంక్ బాండ్ వాకర్స్ సంఘము అద్వర్యంలో డా.కేర్ హోమియోపతి సిబ్బంది ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఈ సందర్బంగా హోమియోపతి వైద్యులు అక్కడికి విచ్చేసిన వారికి షుగర్ మరియు బీపీ పరీక్షలు నిర్వహించారు అలాగే దీర్ఘకాలిక వ్యాధుల గురించి తెలియజేసి సూచనలు తెలియజేశారు.ఈ సందర్బంగా వాకర్స్ సంఘము సభ్యులు డా.కేర్ సంస్థ ఎండి డా.ఎఎం రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘము అధ్యక్ష కార్యదర్శులు బొల్లపెల్లి రాజేశ్వర్,శ్రీనివాస్,సంజీవరెడ్డి,వైద్యులు డా.నిఖిల్ తేజ,ప్రీతి,పిఆర్వో శంకర్ సింగ్,పవన్,పూజ,హరిణి పాల్గొన్నారు.