
చర్ల మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎంబిబిఎస్ డాక్టర్ లేనందువలన చర్ల సిపిఎం ఆధ్వర్యంలో రెండోరోజు దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్ రావు దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేకమంది విష జ్వరాలకు వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని 2021 లోనే సిపిఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేయడం జరిగిందని ఆ సందర్భంగా ఉన్నత అధికారులు చర్ల మండలంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) లొ ఎంబిబిఎస్ డాక్టర్లను మరియు సిబ్బందిని నియమిస్తామని చెప్పడం జరిగిందినీఈ ప్రాంతంలో దాదాపు 60.70 గ్రామాలు ఉన్నాయని జబ్బు చేస్తే సరి అయిన వైద్యం చేయడానికి డాక్టర్లు లేరని ఇప్పటికీ గ్రామీణ గిరిజన గ్రామాలలో సరైన సదుపాయాలు లేక జొలేకట్టి హాస్పిటల్ తీసుకొచ్చే పరిస్థితి ఉన్నదని కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా లేదని టిఆర్ఎస్ ప్రభుత్వానికి సిత్త సుద్దే ఉంటే తక్షణమే స్పందించి చర్ల మండలం ప్రభుత్వ ఆసుపత్రి లో MBBS డాక్టర్లని తగిన సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మధ్యకాలంలో క్రాంతి పురం గ్రామంలో మహిళపాము కాటు కు బలి అయిందని డెంగ్యూ వ్యాధికి మలేరియా విష జ్వరాలు విజృంభిస్తున్న సమయంలోఆస్పత్రిలో వైద్యం లేదని ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని సీమాంగ్ సెంటర్ విభాగంలో అవసరమైన డాక్టర్లు సిబ్బంది నియమించాలని హాస్పటల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని. చర్ల CHC. సీమాంగ్ సెంటర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తక్షణమే హాస్పిటల్ లో డాక్టర్ నియమించకపోతే దశలవారి పోరాటాలు ఆందోళనలు నిర్వహిస్తామని.సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగే రిలేనిరాహార దీక్షలకు అన్ని రాజకీయ పార్టీల వారు ప్రజాసంఘాలు వ్యాపార సంఘాలు మీడియా మిత్రులు మద్దతు ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు.
ఈ దీక్షలలో పాల్గొన్న నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎలమంచిలి రవికుమార్ భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు కో కన్వీనర్ కారం పుల్లయ్య సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం నరేష్ మరియు దీక్షలలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు. మచ్చ రామారావు బందెల చంటి పామర్ బాలాజీ సింగ్ పార్టీ సభ్యులు ఊడుగుల షారోను వరదల వరలక్ష్మి ఇసం పల్లి రమేష్ ఈసంపల్లి నరసింహారావు ఈసంపల్లి వెంకన్న ఈసంపల్లి ముసలయ్య పోడుతూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.