
డిజెలు పెడితే చర్యలు తప్పవు
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్,ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లిళ్లు మరియు ఊరేగింపుల పేరిట డీజే లు నడుపుతూ శబ్ద కాలుష్యమే కాకుండా రోడ్డు వెంట వచ్చి పోయే వాహనాలకు మరియు ప్రజల ప్రయాణానికి ఆటంకం కలిగిస్తూ ఉండగా, గురువారం రాత్రి అనగా 6.3.2025 తెల్లవారితే 7.03.2025, మొత్తం 5 డీజేలను పోలీస్ స్టేషన్ కు తరలించి,వాటి యజమానుల మరియు డీజే ఆపరేటర్ల మీద కేసులు నమోదు చేయడం జరిగిందని సిఐ వెల్లడించారు.ఇకపై కూడా ఎవరైనా డీజేలు పెట్టినట్లైతే వారిపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.