
డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్ది గా రెడ్యానాయక్
డోర్నకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్యేల్యే అభ్యర్ది గా ప్రస్తుత శాసన సభ్యులు ధరంసోత్ రెడ్యానాయక్ ను భరిలో ఉండబోతున్నారని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మేల్యేగా పోటి చేసి ఐదు సార్ల ఎమ్మేల్యేగా గెలిచిన రెడ్యానాయక్ ను ఎమ్మేల్యే అభ్యర్దిగా డిక్లేర్ చేసారు. ఈ సందర్బంగా డోర్నకల్ నియోజకర్గంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని బిఆర్ఎస్ అభ్యర్థులే ముందు వరుసలో ఉంటారని ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో తావు లేదని ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా మా రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయని తెలిపారు డోర్నకల్ టికెట్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ డోర్నకల్ నియోజకవర్గాన్ని భారీ మెజారిటీతో గెలిపించి కేసిఆర్ కు కానుకగా ఇస్తామని వచ్చే ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్ గా చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు, నవీన్ రావు అధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి,మరిపెడ ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జడ్పిటిసి శారదా రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ సింధూర రవి నాయక్, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ అశోక్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు అజ్మీర రెడ్డి,బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు నా రెడ్డి సుదర్శన్ రెడ్డి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు రోడ్లుపై బాణసంఛ కాల్చి,మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.