
telugu galam news e69news local news daily news today news thammadapally g news
తాడి చెట్టు పై నుండి కింద జారిపడ్డ మొగిలి గౌడ్ గళం న్యూస్ జఫర్ఘడ్ జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో తాటి చెట్టు పై నుంచి జారిపడిన ఘటనలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి.గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన మొగులగాని మొగిళిగౌడ్ ఆదివారం సాయంత్రం అదే గ్రామంలో సిహెచ్.మల్లయ్యకు చెందిన వ్యవసాయ భూమిలోని తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా కాలు జారి కిందపడిపోయాడు.దీంతో ఆయనకు వెన్నుముక విరగడంతో పాటు తీవ్రగాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి (మ్యాక్స్ కేర్) కి తరలించి చికిత్స చేయించడం జరుగుతుంది.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు,కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.