
ఈ69న్యూస్ జనగామ/జఫర్ఘడ్:జనగామ జిల్లా,జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(జి)గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం నాడు పోషణ పక్షం సందర్భంగా పోషణ జాతర కార్యక్రమం జరగింది.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు,పిల్లల తల్లులు,ఆశా వర్కర్లు భాగస్వాములుగా పాల్గొన్నారు.పిల్లల ఆరోగ్య పరిరక్షణ,పోషణకు ప్రాధాన్యంనిస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆహార వంటల ప్రదర్శనలు,ఫ్రీ స్కూల్ మోడల్ చూపించడం,పిల్లల బరువు,ఎత్తు,జబ్బల కొలతలు నమోదు చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్ లోకిని అరుణ,అంగన్వాడి టీచర్లు బి.రాజ్యలక్ష్మీ,ఎం.రేణుక,అంగన్వాడి ఆయా మునిగే బుజ్జమ్మ,పిల్లల తల్లులు తదితరులు హాజరయ్యారు.స్థానిక ప్రజలు కార్యక్రమాన్ని అభినందించారు.