తలసేమియా చిన్నారుల కోసం 26న మెగా రక్తదాన శిబిరం
జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్,అధికారులకు ఆహ్వానం భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం జనవరి 26న అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్,వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి,హనుమకొండ రెవెన్యూ కలెక్టర్,అలాగే రవిని నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి రక్తదాన శిబిరం వివరాలను సమగ్రంగా వివరించారు.మానవత్వం,సేవాభావం,సమాజ బాధ్యత అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వారు తెలిపారు.ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు నిరంతర రక్త అవసరం ఉండటంతో ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రక్తదాన శిబిరానికి సంబంధించిన బ్రోచర్లను అధికారుల చేతుల మీదుగా అధికారికంగా ఆవిష్కరించారు.సమాజంలో రక్తదానం యొక్క ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు.ఈ సేవా కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ అధ్యక్షుడు ముహమ్మద్ యాకూబ్ పాషా,యూత్ అధ్యక్షుడు ముహమ్మద్ కబీర్ పాషా,మిషనరీ ఇంచార్జీ అయాన్ పాషా,సర్కిల్ ఇంచార్జి ఆసిఫ్ అహ్మద్ ఖాదిం తదితరులు పాల్గొన్నారు.