
ప్రజాసంఘాల ధర్నా
దళితుల భూమిలో దౌర్జన్యం గా రోడ్డు వేస్తున్న రోడ్డు పనులు వెంటనే నిలిపి వెయ్యాలని తహసీల్దార్ కార్యాలయం ముందు
ప్రజాసంఘాల ధర్నా
కొడంగల్ మండలం, పర్సపూర్ గ్రామనికి చెందిన ఇస్వప్ప మరియు ప్రవీణ్ కుమార్ అనే దళితుల పట్టభూమి లో నుంచి అక్రమంగా కాంట్రాక్టర్ రోడ్డు వెయ్యడాన్ని వెంటనే ఆపాలని, దళితుల అనుమతి లేకుండా వారి భూమిని తవ్వి ఆర్థికంగా నష్టపరిచి, దళితున్ని చంపుతానాన్ని బెదిరించిన కాంట్రాక్టర్ రాంనాథ్ రెడ్డి పైన ఎస్సీ ఎస్టీలు కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని నేడు వ్యవసాయ కార్మిక సంఘం,సిఐటియు, అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం, కే ఎన్ పి ఎస్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటి ఆధ్వర్యంలో కొడంగల్ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ విజయ్ కుమార్ గారికి మెమోరం సమర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చెంద్రయ్య, కొత్తూరు చెంద్రయ్య, దస్తయ్య మాట్లాడుతూ… పర్సాపూర్ గ్రామానికి చెందిన దళితులు ఈశ్వరప్ప ప్రవీణ్ కుమార్ లకు ఆ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 268,269 లో 30 గంటల పట్టా భూమి కలదు. పాత కొడంగల్ నుండి పలుగురాళ్ల తాండకు వేసి బి.టి రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు ముందున్న నక్ష బాట రోడ్డు కాకుండా దళితుల అనుమతి లేకుండా నేరుగా వారి పట్ట భూమిలో నుంచి తవ్వి రోడ్డు వేయడం దుర్మార్గమన్నారు. ఒక దళితులు భూమిలో నుంచి ఏ కాంట్రాక్టర్ రోడ్డు వెయ్యాలన్న భూ యజమాని అనుమతులు తప్పనిసరి కానీ ఆ దళితులకు సమాచారం వేయకుండా వారి పట్ట భూమిలో నుంచి అక్రమంగా దౌర్జన్యంగా రోడ్డు వేస్తూన్నారు. మా పొలం పక్కన లక్ష బాట రోడ్డు ఉండగా మా పొలం నుంచి ఎందుకు రోడ్డు వేస్తున్నారని కాంట్రాక్టర్ ను దళితులు ప్రశ్నించగా మేము బరాబరు వేస్తాం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో,దిక్కున చోట చెప్పుకో అని ఆ దళితులను బెదిరించారు, అంతకు ఆకుండా నీవు మరోసారి రోడ్డున అడ్డుకుంటే నిన్ను చంపి నీ మీద నుండి రోడ్డు వేస్తామని కాంట్రాక్టర్ మరియు కొంతమంది లోకల్ అధికార పార్టీ నాయకులు దళితులను బెదిరించారు. ఆ కాంట్రాక్టర్ చట్ట ప్రకారము ఈ రోడ్డు వేయడం లేదన్నారు. కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా తన సొంత ప్రయోజనాల కోసం తనకు లాభాలు చేకూర్చాలని నక్ష బాట నుండి వేస్తే తను నష్టపోతాడని దళితుల పొలం నుంచి రోడ్డు వేస్తే కాంట్రాక్టర్ లాభాల బాటన పడతాడని వారు అన్నారు. ఇప్పటికైనా తక్షణమే అధికారులు పోలీసులు స్పందించి దళితుల అనుమతి లేకుండా ఆ రోడ్డు పనులు వెంటనే నిలిపివేసి, అక్రమంగా దళితుల భూముల్లో నుండి రోడ్డు వేసి, దళితులను బెదిరించిన కాంట్రాక్టర్ రామ్నాథ్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయకపోతే కొడంగల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని దళిత ప్రజా సంఘాలు హేచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమలో KNPS జిల్లా నాయకులు లక్ష్మయ్య, సుందర్ రాజు, అబ్బక్ రాజు, రాములు, శంకర్ రాజు, ఆశప్ప, బీమామ్మ,పకిరామ్మ, జి. చిన్నయ్య,బి. హన్మంత్ గ్రామస్తులు పాల్గొన్నారు.