
తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరి
తెలుగు గళం స్టేషన్ ఘనపూర్
వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఉప ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.శుక్రవారం సాయంత్రం స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో సిరిపురం గార్డెన్స్ లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మల్లన్న గెలిపించాలని అన్నారు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకగా ప్రజల వైపున ఉండి పట్టభద్రుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని అన్నారు.