
జంగా రాఘవ రెడ్డి చైర్మన్ తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్
ఈ నెల 8న ఖమ్మం జిల్లాలో మా సంస్థ జిల్లా ఇన్చార్జీ ఆఫీసర్(డి.వో) కు తెలంగాణ ఆయిల్ పాం రైతు సంఘాల పేరుతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఆ పత్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పాంసాగు విస్తరించబడుతుందని పెర్కోన్నారు.ఆ లేఖ లో పెర్కొన్నట్లు రాష్ట్రంలో ఆయిపాం సాగు విస్తరణ కు ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ పనిచేస్తున్న విషయం వాస్తవమే. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు గత 30 ఎళ్లుగా పామాయిల్ సాగు చేస్తూ విశేష అనుభవం గడిస్తు వస్తున్న విషయం తెలిసిందే.ఇంతటి అనుభవం ఉన్న ఖమ్మం ప్రాంత రైతులు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఆయిల్ పాం సాగుకు ప్రొత్సహాకరంగా ఉండాలి.
ఇతర జిల్లాలకు ఆ సదర్ రైతు సంఘాలు ఆయిల్ పాం సాగుకు విస్తరణ జరుగుతుంటుంటే కొత్తగా సాగు చేస్తున్న ఆయిల్ పాం రైతులను ప్రొత్సహించాల్సింది పోయి గందరగోళ పడేలా.. తప్పుదారి పట్టేలా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న విషయాలను వక్రీకరించి వాట్సప్ లో ఇతర సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఆయిల్ పాం రైతుల డెవలప్మెంట్ ను అడ్డుకుంటున్నారు.
ఇలా గందరగోళ పరచడం నూతన రైతులను అయోమయంలో పరిచేలా మీ చర్యలు సరికావని గతంలో పలుమార్లు పత్రికా ముఖంగా, మీడియా ద్వారా.. సోషల్ మీడియా ద్వారా ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ తరఫున తెలియజేశాం. ఇపుడు కూడా మరోసారి తెలియజేస్తున్నాం.
రాష్ట్రంలో నూతనంగా ఆయిల్ పాం సాగు చేస్తున్న రైతులను మీ తప్పుడు చర్యలతో గందరగోళపరచకండని విన్నవిస్తున్నాం.ఆ వినతి పత్రంలో 5 డిమాండ్లను పెర్కొన్నారు.రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల గెలల నుంచి అరవై వేల మెట్రిక్ టన్నుల ముడి పామాయిల్ ఉత్పత్తి అవుతుందని రిఫైనరీ (నూనె శుద్ధి) ఎర్పాటును కోరారు. దీనికి తెలంగాణకు నడిబొడ్డు హైదరాబాద్ మార్కెట్ కు దగ్గర గా ఉన్న ప్రాంతం సిద్ధిపేట జిల్లాలో నంగునూరు మండలం నర్మెట్టలో రిఫైనరీ(నూనె శుద్ధి) యూనిట్ ఫ్యాక్టరీతో పాటు వచ్చే జూన్ లో అందుబాటులోకి రానుంది.టెండర్లను కూడా త్వరలో ప్రకటిస్తాం.
ఖమ్మం జిల్లాలో ఆయిల్ ఫెడ్ రైతులకు ఆఫ్ టైప్ మొక్కలకు నష్టపరిహారం ఇవ్వాలని పెర్కొన్నారు. ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ తరఫున 100 శాతం మేమే వాట్సప్ సోషల్ మీడియా ద్వారా ఆయిల్ ఫెడ్ రైతులకు ప్రకటన ద్వారా తెలియజేశాం.ఆ ప్రకటనలో ఎవరైతే ఆయిల్ పాం రైతులు తాము సాగు చేసిన మొక్కలు సాగులో సరిగా నీరు అందించక గానీ,ఫార్టీ లైజర్ మందులు అందించకగానీ, చీడ పురుగుల కారణంగా గానీ, ఇతరరేతర కారణాలతో మొక్కలు పాడైనా మొక్కలు ఎవైనప్పటికీ వాటి స్టానంలో ఆయిల్ ఫెడ్ మళ్లీ కొత్త మొక్కలను రిప్లేస్ చేస్తుందని సంస్థ తరఫున భర్తీ చేస్తామని ప్రకటన ఆయిల్ ఫెడ్ తరఫున చైర్మన్ గారి పేరుతో ప్రకటన చేసాం.
ఈ అవకాశం ను రాష్ట్రంలో ని ఆయిల్ పాం రైతులు వినియోగించుకోవాలని తెలియజేశాం.రైతుకు నష్టపడే ఎటువంటి చర్యలను ఆయిల్ ఫెడ్ తీసుకోదు.లాభం చేసేందుకే పని చేస్తామని మరోసారి తెలియజేస్తున్నాం.
ప్రధానంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తరఫున తెలియజేస్తున్నాం.
ఈ విషయాలన్ని మీకు తెలిసినవే మంత్రి గారు ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ తరఫున, ప్రభుత్వ పరంగా వారు పామాయిల్ రైతులకు సబ్సీడి ఇతర ప్రొత్సహాకాలను అందివ్వడం జరిగిన విషయం ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాం.
ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలఆయిల్ పాం సాగు అందుబాటులో ఉందని అదనంగా ఇంకో ఆయిల్ పాం ఫ్యాక్టరీని కల్లూరిగూడెం దగ్గర ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ ద్వారా మంజూరు చేపించి టెండర్ ప్రక్రీయ పూర్తి కాకముందే భూమి పూజ చేసి నేటికి టెండర్ పూర్తి చేపించి అతి త్వరలో ఫాక్టరీ నిర్మాణం పూర్తయ్యేల చర్యలు తీసుకొని వచ్చే ఉగాది లోపు ఆయిల్ పాం రైతులకు అందుబాటులోకి ఫ్యాక్టరీ ప్రారంభం చేసే దిశగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అదే కాకుండా మరో 4 డిమాండ్లను మా ముందు పెట్టారు. 1. ఐఐఒపిఆర్ ద్వారా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని అడిగారు.తప్పకుండా ఈ డిమాండ్ ను నేరవేరుస్తామని తెలియజేస్తున్నాం. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు ప్రభుత్వం తరఫున కేంద్రకు ఈ అంశం పై ఇప్పటికే లేఖ రాసి ఉన్నారు.ఐఐఒపిఆర్ ద్వారా పరిశోధన కేంద్రం ఏర్పటుకు మంత్రిగారు ప్రకటించి ఉన్నారని మరోసారి గుర్తు చేస్తున్నాం.
2.రైతుల భాగస్వామ్యంలో 75 శాతం వాట అనేది తప్పు. రైతుల నుంచి కోనుగోలు చేసిన పామాయిల్ గెలల నుంచి తీసిన ఆయిల్ లో 75 శాతం పై ధర ప్రభత్వం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది కానీ రైతుకు ఎటువంటి భాగస్వామ్యమనేది వుండదు. 3. అయిల్ ఫెడ్ కో -ఆపరేటివ్ ఫెడరేషన్ కాబట్టి ఇందులో భాగస్వాములైన రైతులతో సమావేశాలు ఎర్పాటు చేయాలని కోరారు.
దీనికి కో-ఆపరేటివ్ చట్టం ద్వారా ఎర్పడిన ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ ఎడుగురు డైరక్టర్లతో కూడిన బోర్డు ఉంటుంది.ఇందులో ఐఎఎస్ ఆఫీసర్లు,చైర్మన్, మెనేజింగ్ డైరక్టర్ తో కూడిన మొత్తం 9 మందితో కూడిన బోర్టు ఉంటుంది.
ఆ బోర్డులో రైతుల సంక్షేమం,ఇతర సదుపాయాల గురించి ఆయిల్ ఫెడ్ డెవలప్ మెంట్ గురించి జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఈ డిమాండ్ పెట్టక ముందే జనరల్ బాడీ పద్దతి నడుస్తుంది.అందులో అంత పారదర్శంకంగా రైతుల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవడం జరగుతుందని ఈ సందర్భంగా మరోసారి ఆయిల్ పామ్ రైతు సంఘం ప్రతినిధులకు తెలియజేయునది ఎమనగా తెలంగాణ లో ఆయిల్ పాం సాగుకు మీరు తొడ్పండి. సలహాలు , సూచనలు ఇవ్వండి.కానీ గందరగోళ పరిచే విషయాలు, సంబంధం లేని డిమాండ్లు పెట్టి ఆయిల్ ఫెడ్ డెవలప్ ను అడ్డుకోవద్దని ఆయిల్ ఫెడ్ విజ్ణప్తి చేస్తున్నది.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతు పక్షపాతి కాబట్టే రైతుకు నష్టం చేసే ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని లాభాలు వచ్చేల మనం రైతు బిడ్డలుగా రైతుకు మేలు చెద్దామని సూచిస్తూ చైర్మన్ అయిన నన్ను గైడు చేస్తున్నారు. ప్రింట్ ఆండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పామాయిల్ సాగు పై తప్పుడు,గందరగోళ వార్తలు పంపితే వెంటనే ప్రచురించకుండా మా ఆయిల్ ఫెడ్ సంస్థ చైర్మన్ ను అయిన నాకు గానీ , మెనేజర్ కు గానీ తెలసి వివరణ తీసుకోగలరు.
ఎందుకంటే రైతు సంక్షేమం ముఖ్యం.మీరు కూడా రైతుల బిడ్డలే కాబట్టి రైతు సంక్షేమంలో పత్రికా మిత్రులు కూడా కలసి రావాలని కోరుతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు మేలు కోరకు అధిక నిధులు కేటాయిస్తున్నది. రైతును రాజు ను చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం కాబట్టి అందరం రైతు మేలు కోసం పాటు పడుదామని ఆయిల్ ఫెడ్ తరఫున విన్నపం. జంగా రాఘవ రెడ్డి చైర్మన్ తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ సుధాకర్ రెడ్డి మెనేజర్ తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్……..