
ఆది గురువుగా, నాయకుడిగా, ప్రజాస్వామ్యవాదిగా, నైతిక విలువలు పాటించి పరిపూర్ణ జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి, కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జై న్
బుధవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా యూనిట్ అధికారులు, సిబ్బందితో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ నాడు ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలోని గిరిగాం గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుండి ఎస్టీ, బీసీ, మైనార్టీల సఖ్యత కోసం అహర్నిశలు పోరాడిన మహోన్నత వ్యక్తి ఆయనని, తాను ప్రత్యేక రాష్ట్రం కోసమే కాక, స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ పాలనను మన్న
అంత ం చేయడానికి ప్రజలలో స్ఫూర్తి నింపి ముందుండి ఉద్యమం నడిపించాడని కొనియాడారు. ముఖ్యంగా తెలంగాణ గడ్డ కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కుటుంబాన్ని, పదవులు కోల్పోయి తన కుటుంబానికి ఏమి మిగల్చకుండా ఆస్తిలో 1/3 వంతు ట్రస్ట్ కు ఇచ్చి, త్యాగం చేసిన మహనీయుడని, కొండా లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రజల కోసం చేతనైనంత సేవా కార్యక్రమాలు చేసి ప్రజలతో మమేకమై ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఏవోభీమ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ , ఎస్ ఓ సురేష్ బాబు, ఏసీ ఎం ఓ రమణయ్య, ఏడి అగ్రికల్చర్ భాస్కరన్, డి ఎం జి సి సి విజయ్ కుమార్, హెచ్ఎన్ టీ సి అశోక్, ఏ పీ ఓ పవర్ మునీర్ పాషా, జెడియం హరికృష్ణ, వివిధ శాఖలకు చెందిన మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.