
•ఏకశిల ఈ - టెక్నో పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు
•ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి
•ఏకశిల ఈ – టెక్నో పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు
తెలుగు గళం న్యూస్ అయినవోలు/సెప్టెంబర్ 20
హనుమకొండ జిల్లా ఐనవోలు: మండలంలోని ఖమ్మం హైవే పై గల ఏకశిలా ఈ టెక్నో పాఠశాలలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యండి. బాబా ఆధ్వర్యంలో బతుకమ్మ లోగోను పూలతో ఆవిష్కరించారు. అనంతరం దాని చుట్టూ బతుకమ్మ లను ఏర్పాటు చేసి, బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రకృతి వరప్రసాదంగా బతుకమ్మ పండుగను భావిస్తారన్నారు. ఆడపడుచులకు ఈ పండుగ ప్రత్యేకమని అన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ యండి. బాబా, వైస్ ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు