
తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా నారపోగు రాణి
తల్లాడ మండల తెలుగుదేశం పార్టీ నుండి కేతినేని హరీష్ మాట్లాడుతూతెలుగుదేశం పార్టీ తరఫున జడ్పిటిసిగా నారపోగు రాణి ,
కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలి: జిల్లా నాయకులు కేతినేని హరిచంద్ర.తెలుగుదేశం ఎన్నికల సన్నాహ కసమావేశం నిర్వహించారు రానున్న స్థానిక ఎన్నికలకు టిడిపి పార్టీ నాయకత్వం సంసిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కేతినేని హరిచంద్ర పిలుపునిచ్చారు.
తల్లాడ మండలంలో కేతినేని థియేటర్ ఆవరణలో మండల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలకు టిడిపి నాయకత్వం సంసిద్ధం కావాలని,అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలంపై అవగాహన తెలుపుతూ ప్రచారం నిర్వహించాలని గ్రామస్థాయిలో నాయకత్వంతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని స్థానిక ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా చర్చించుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నిక నిర్వహణకుగ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.తెలుగుదేశం పార్టీ నుండి తల్లాడ జెడ్పిటిసి ఎస్సి కావటంతో బిల్లుపాడు గ్రామం నుండి నారపోగు రాణి కి అవకాశం ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు , ప్రజలు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో
టిడిపి మండల అధ్యక్షులు సరికొండ శ్రీనివాసరాజు,టిడిపి మండల నాయకులు ధూపాటి భద్రరాజు, దుగ్గినేని వెంకటేశ్వర్లు, నున్న రామారావు, నారపోగు ప్రసాద్,గొడ్ల. వెంకటరత్నం,పట్టణ అధ్యక్షుడు మొక్క కృష్ణార్జున్,టెంట్ సురేష్ బాబు,మండల నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.