
గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో 532.5 మార్కులు సాధించిన తేజస్విని రెడ్డి…
గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో 532.5 మార్కులు సాధించిన తేజస్విని రెడ్డి…
వరంగల్ పశ్చిమ నియోజవర్గ పరిధిలోని 57 వ డివిజన్ పరిధిలో గాంధీనగర్ కాలనీకి చెందిన జిన్నా విజయ్ పాల్ రెడ్డి హేమలత దంపతుల కుమార్తె తేజస్విని రెడ్డి ఇటీవలే విడుదలైన గ్రూప్ -1 పరీక్ష ఫలితాల్లో 532.5 మార్కులు సాధించగా విషయం తెలుసుకున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ఈ రోజు వారి ఇంటికి తేజస్విని ప్రత్యేకంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.గతంలో గ్రూపు-2 మొదటి ప్రయత్నంలోని మండల పంచాయతీ గా ఎంపికైన విషయం పట్ల ఎమ్మెల్యే నాయిని హర్షం వ్యక్తం చేశారు.ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని,భవిష్యత్ లో తేజస్వినికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే నాయిని హామీ ఇచ్చారు.కూతురు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంచి ఫలితాలకు అవకాశం ఇచ్చేలా పాటుపడిన తేజస్విని తల్లిదండ్రులను అభినందించారు.
ఎమ్మెల్యే గారితో పాటుగా స్థానిక నాయకులు హనుమకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్,నాయిని లక్ష్మా రెడ్డి ,డివిజన్ వాసులు శ్రీనివాస్ రావు, రగోత్తం రావు, యాదగిరి గౌడ్, విఠల్ రెడ్డి, చేరలు, సతీష్, బాషా, అనిల్ తదితరులు ఉన్నారు.