పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్
పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్
నాంపల్లి మండలం చిట్టెంపాడుగ్రామాంలో నిరుపేదలుగా ఉన్న దళితులు గత 40 ఏళ్లుగా తోలు ఊనకం ఉత్పత్తి మీదనే ఆధారపడిన 40 కుటుంబాల ను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు ఈరోజు నాంపల్లి మండలం చిట్టెంపహాడ్ గ్రామంలో సిపిఎం మండల కమిటీ పోరు బాటలో భాగంగా తోలు ఊనకం దారుల కుటుంబాలను కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఎంతో శ్రమకోర్చి తోలును సేకరించిన ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి సరుకులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంగేడి చెక్క కొరత తీవ్రంగా ఉందని కనీసం నీటి వసతి లేదని సొంత భవనం కూడా లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు పడుతున్నామని వారు తమ ముందు గోడు వెళ్ళబోసుకోవడము జరిగింది. ప్రభుత్వాలు మారినప్పుడు అనేక వాగ్దానాలు చేయడం తప్ప దళితులకు తోలు ఉత్పత్తిదారుల పైన కనీసం శ్రద్ధ లేదని అన్నారు. దళిత బంధు అంబేద్కర్ పేర్లు మారినై తప్ప దళితులకు వన వూరిందేమీ లేదని తెలిపారు తంగేడు చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చిట్టెంపహాడ్ గ్రామ దళితుల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తోళ్ల పరిశ్రమలకు ప్రత్యేక భవనము నిర్మించినప్పటికీ శిధిలావస్థకు చేరిందని ప్రభుత్వము నిధులు కేటాయించి 20 లక్షలతో భవనం నిర్మాణం చేయించాలని కోరారు. తోలు ఉత్పత్తి కొనసాగించుటకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకంగా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు. తోలు ఉత్పత్తి చేసిన తర్వాత మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం లిడ్ క్యాప్ ద్వారా అవసరమైన యంత్ర పరికరాలను కూడా అందించాలని తెలియజేయడం జరిగింది ఈనెల 24 25 తేదీల్లో నాంపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ముందు జరిగే రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని అదే విధంగా ఈనెల 28న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మండల కమిటీ సభ్యులు కొమ్ము లక్ష్మయ్య, రాఘవాచారి పెరుమాండ్ల కృష్ణ, బుషిపాక సాయిలు,బుషిపాక ముత్తయ్య, బుషిపాక ప్రసాద్ బుషిపాక శ్రీను, రాములు, యాదయ్య , లక్ష్మయ్య, బజారు, పెద్దయ్య , నరసింహ, తదితరులు పాల్గొన్నారు